ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రజావేదికను ఉన్నట్టుండి ఖాళీ చేయమంటున్నారంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు.

 

ప్రజావేదిక వద్ద నుంచి చంద్రబాబు వస్తువుల్ని అధికారులు తరలించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజావేదిక వద్దకు టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేరుకున్నారు. రెవెన్యూ అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు.

 

చంద్రబాబు లేని సమయంలో ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. అసలు విషయానికి వస్తే... ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదికపై గత టీడీపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు తమపార్టీ నేతలు, అధికారులు,కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించుకునేందుకు ఉపయోగించేవారు.

 

అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఈ వేదికను తమ పార్టీ అవసరాలకు ఇవ్వాల్సిందింగా టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వైసీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించింది లేదు. శుక్రావారం ఉన్నట్టుండి సీఆర్ డీఏ అధికారులను అక్కడికి పంపింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజావేదిక వద్దకు వెళ్లిన అధికారులు దాన్ని ఖాళీ చేయాలని టీడీపీ నేతలకు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: