ఇదే నా అభయం, మీ ఎమ్మెల్యేలు నాకొద్దు. నాకున్న వారు చాలు. నేను కనుక గేట్లు తెరిస్తే మీ వారంతా జంప్. కానీ నేను అలా చేయను. చేస్తే నాకు బాబుకు తేడా ఏముంటుంది. ఇదీ నిండు అసెంబ్లీలో జగన్ ఇచ్చిన అభయం. దాంతో బాబు గారు అండ్ కో తెగ ఆనందపడ్డారు.  ఆయితే ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండేలా కనిపించడంలేదు. 


బీజేపీ ఈ అవకాశాన్ని తీసుకుని గేట్లు తెరచేసింది. ముందుగా రాజ్య‌సభ సభ్యులు నలుగురిని తమ వైపుకు తిప్పుకుంది. వారికి బీజేపీ ఎంపీలుగా ముద్ర వేసేసింది ఇక ఇపుడు చూపు ఏపీ మీద పడింది. ఇక్కడ అసెంబ్లీలో ఉన్న వారిలో మూడింట రెండు వంతుల మందిని లాగేయాలని కమలం స్కెచ్ వేస్తోంది.


అదే జరిగితే బాబు గారి అప్పోజిషన్ పోస్ట్ కూడా వూడిపోతుంది. మరి బాబు గారు మాత్రం ఏమి చేయగలరు. జగన్ దయ మీదనే తమ్ముళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అయితే తాను ఎమ్మెల్యేలను తీసుకోనని అన్నారు కానీ వేరేవరో తీసుకుంటే కాపలా కాయగలనా అని జగన్ లాజిక్ తీస్తే మాత్రం టీడీపీ డేంజర్ లో పడినట్లే. అసెంబ్లీలో ప్రత్యేక గ్రూప్ గా బీజేపీ వస్తే మాత్రం చంద్రబాబు కు ఆ ఉన్న పదవీ పాయే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: