గత ఎన్నికల్లో లోకేష్ దారుణమైన ఓటమిని ఎదుర్కొన్నాడు.  తెలుగుదేశం పార్టీ ఓటమితో పాటు లోకేష్ కూడా ఓడిపోవడంతో.. పార్టీ ఇబ్బందుల్లో పడింది. ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేగా పోటీ చేశారు.  


ఇది ఆయనకు ఒక అదృష్టమని చెప్పాలి.  ఒకవేళ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఉంటె.. ఇప్పుడు ఇబ్బంది వచ్చేది.  అలా చేయకుండా ఉండటం ఆయనకు మేలు కలిగింది.  ఇదే ఇప్పుడు అదృష్టంగా మారింది.  గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ గా ఉన్న లోకేష్ కు జగన్ ప్రభుత్వంలో పదవి లభించింది. 

జిల్లాలో ఉండే ఎమ్మెల్సీలు ఏదోఒక నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించాలి.  దీంతో లోకేష్ మంగళగిరిని ఎంచుకున్నాడు.  దీంతో ప్రభుత్వం ఆయనకు మంగళగిరి ఎక్స్ అఫిషియో మెంబెర్ గా నియమించింది.  ఇది ప్రభుత్వం పదవీ అనే చెప్పాలి.  


దీంతో గుంటూరు జిల్లా పరిషత్ మున్సిపల్ బోర్డు సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని ఎక్స్ అఫిషియో హోదాలో ఉన్న లోకేష్ కు ఆహ్వానం పంపింది.  పార్టీ అధికారంలో లేకపోయినా.. జగన్ ప్రభుత్వంలో లోకేష్ పదవిని సంపాదించుకున్నాడు.  పాపం బాబుకు మాత్రం ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోయే విధంగా మారుతున్నాయి పరిస్థితులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: