ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీలోనే కొనసాగుతారా లేక పార్టీ మారుతారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ భవిష్యత్తు ఏంటనే టెన్షన్ టీడీపీ శ్రేణులను వెంటాడుతుంటే...

 

ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మహిళా ఎమ్మెల్యేను మాత్రం మరో రకమైన ఆందోళన వెంటాడుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2014లో విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత... అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

 

ఒకదశలో మంత్రివర్గ విస్తరణలో ఆమెకు ఛాన్స్ ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో అనితకు ఆమె సొంత సీటు అయిన పాయకరావుపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. ఆమెకు విశాఖ జిల్లా పాయకరావుపేటకు బదులుగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీటు ఇచ్చారు. అయితే అక్కడ ఆమె విజయం సాధించలేదు.

 

తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి పోటీ చేయాలని ఆమె ప్రయత్నాలు చేయగా... అక్కడ టీడీపీ తరపున ఓడిన బంగారయ్య కార్యకర్తలతో మమేకమవుతున్నారు. దీంతో తనకు మళ్లీ పాయకరావుపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారో లేదో అనే ఆందోళన అనితలో కనిపిస్తోందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: