మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ప్రవేశించి, మెల్లగా ప్రేక్షకుల మెప్పుతో పవర్ స్టార్ గా స్టేటస్ సంపాదించిన పవన్ కళ్యాణ్ కు మొదటినుండి సామజిక అంశాలపై మక్కువ ఎక్కువ, అంతేకాక ప్రజలకు తనవంతుగా ఏదో చేయాలి అనే తపన ఆయనకు చిన్నప్పటినుండి ఉండేదని అయన సోదరులు చిరంజీవి, నాగబాబు పలు మార్లు చెప్తూ ఉంటారు. ఇకపోతే గతంలో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి అధ్యక్షులుగా వ్యవహరించిన పవన్, అప్పట్లో ఆ పార్టీ ఓటమితో బయటకు వచ్చేసారు. ఆపై ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత 2014లో అయన స్వయంగా జనసేన పార్టీ నెలకొలిపి, అప్పటి ఎన్నికల సమయంలో టిడిపికి తమ మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి మంచి మెజారిటీతో విజయం సాధించింది. నిజానికి తాను రాజకీయాలోకి వచ్చింది అధికారం కోసం కాదని, అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం చేకూరేలా చేయడానికని, అలానే ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటానని అయన ఎప్పుడూ చెపుతూ ఉంటారు. 

ఇకపోతే మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలిచిన జనసేనకు కేవలం ఒకేఒక ఎమ్యెల్యే సీటు దక్కింది. ఇక పవన్ పోటీచేసిన రెండు నియోజకవర్గాలలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే ఈ విషయమై నిన్న సామజిక మద్యమాల్లో మాట్లాడిన అయన సోదరుడు నాగబాబు, ఏదో ఒకసారి తాము ఓటమిపాలయ్యామని ప్రతిసారి అలానే జరుగుతుందని ఎలా చెప్పగలం అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ గారికి సానుభూతి మంత్రం పనిచేసిందని, కానీ రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మేము విజయం సాధిస్తామని అయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై కొందరు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, ప్రస్తుతం సీఎం గా కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజాసంక్షేమ పథకాలు సక్రమంగా ప్రవేశపెట్టి, అలానే ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ప్రజా పాలనలో ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకుంటే మాత్రం మరొక్కసారి ఆయనకు అధికారం దక్కవచ్చని, ఇక మరోవైపు అధికారాన్ని కోల్పోయిన టిడిపిని మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబుని తక్కువ అంచనా వేయలేమని అంటున్నారు. 

ఎంతో సమర్ధుడైన చంద్రబాబు, గడిచిన ఐదేళ్ల తమపాలనలోని లోపాలను సరిదిద్దుకుని ప్రజల ముందుకువెళ్ళి వారికి ఇప్పటినుండే నమ్మకం కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. మరి అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం రెండూ కూడ రాబోయే ఎన్నికల్లో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైతే, జనసేన అధినేత వారిని మించి పార్టీ నాయకులూ కార్యకర్తలను కలుపుకుని ఎప్పటికపుడు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన కలిగి ముందుకు సాగితే కొంతవరకు ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. అయితే అది అంత సులువు కాదని, పవన్ ఇప్పటినుండే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పూనుకుని రాష్ట్ర పర్యటనలు వంటివి చేసి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు. ఒకపుడు టీడీపీ పార్టీ పెట్టిన కొత్తలో ఎన్టీఆర్ గారు ఎక్కువగా బీద, అట్టడుగువర్గాల వారికి చేరువయ్యారని, అదే ఆయనకు విజయాన్ని చేకూర్చిందని, కాబట్టి పవన్ ఇకనైనా గట్టిగా అలోచించి ఆవిధంగా ముందుకు సాగితే విజయం వరించవచ్చట. మరి అది ఎంతవరకు సఫలమవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: