పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటమిపాలయ్యారు అనే దానిపై ఇప్పటి వరకు అనేక సందేహాలు వస్తున్నాయి.  ఒక్కొక్కరు ఒక్కోరకమైన విశ్లేషణలు ఇచ్చుకుంటూ వస్తున్నారు.  ఎందుకు ఓటమి పాలయ్యాడు అనే దానిపై మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. 


అయితే పవన్ ఓటమికి పది కారణాలు చెప్తున్నారు.  అందులో రాజకీయాల్లో అనుభవం లేకపోవడం, రాజకీయాలకు కొత్త కావడం, సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోలేకపోవడం, గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం వంటి వాటిని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.  


పవన్ ఓడిపోవటానికి మరో కారణం కూడా ఉంది.  గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.  ఆ సమయంలో చిరు 18 స్థానాలు గెలుచుకున్నారు.  18 స్థానాలు గెలుచుకొని అసెంబ్లీకి వెళ్లినా.. కొన్ని కారణాల వలన ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.  


తరువాత వచ్చిన జనసేన పార్టీ 2014లో టిడిపికి సపోర్ట్ చేయడంతో కొంత సారూప్యత కనిపించింది.  ఒకవేళ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చి.. కొన్ని స్థానాలు అవసరమైతే... పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు.  ఎన్నికలకు ముందు టిడిపికి వ్యతిరేకంగా పవన్ మాట్లాడకపోవడం కూడా దీనికి సంకేతంగా మారింది.  బహుశా దీనివలన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యి ఉండొచ్చు అన్నదివిశ్లేషకుల అభిప్రాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: