తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ బీజేపీ లోకి జంప్ అయినా ఆయన కుమారుడు టిజి భరత్  మాత్రం టీడీపీ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి వెంట భరత్,  బీజేపీ లో చేరకుండా, టీడీపీ లోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం హాట్ టాఫిక్ గా మారింది. తండ్రి వెంట భరత్  బీజేపీ లో చేరకపోకపోవడానికి కారణం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజ్ భరత్,  కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో గెలుపోటములను శాసించే స్థాయి లో మైనార్టీ ఉన్నారు. తాను తండ్రి వెంట బీజేపీ లో చేరితే ,  మైనార్టీ లు శాశ్వతంగా తనకు దూరమయ్యే ప్రమాదం ఉందని గ్రహించే భరత్, టీడీపీ లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ లోకి  ఎంతమంది నేతలు వలస వెళ్లిన, ఇప్పటికీ, ఇప్పుడు ఆ పార్టీ  రాష్ట్రం లో వైకాపాకు ప్రత్యామ్నాయంగా బలపడే అవకాశం లేదన్న అంచనాతోనే భరత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు.


టీజీ వెంకటేష్ గతం లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. తాను ఎక్కడ ఉన్నా , అక్కడ పైచేయి సాధించడం ఎలాగో టిజి వెంకటేష్ కు బాగా తెలుసు నని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  బీజేపీ లో చేరిన వెంకటేష్ తన పదవీకాలం ముగిసిన తరువాత, ఆ పార్టీ నుంచి కూడా రాజ్యసభ పదవి దక్కించుకోగల సమర్థుడని, భరత్ ను మాత్రం కర్నూల్ ప్రజలే గెలిపించాలి కాబట్టి ఆయన పార్టీ మారకుండా, టీడీపీ లో కొనసాగుతున్నారన్న టాక్ విన్పిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: