వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర చేసిన ఒక వైద్యునికి, ఇప్పుడు  ఉన్నత పదవి లభించింది. వైఎస్ కుటుంబ  వీరాభిమాని అయిన డాక్టర్ హరికృష్ణ  6, 770 కిమీ మేర  ఆ కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్రలో నడిచారు . తమని నమ్మిన వారికి  వైఎస్ కుటుంబం ఎప్పుడు దన్నుగానే ఉంటుందని మరోసారి రుజువయింది. గతం లో   వైఎస్ షర్మిల తోపాటు, ఇటీవల  వైఎస్ జగన్మోహన్ రెడ్డి లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర లు నిర్వహించిన విషయం తెల్సిందే.


 షర్మిల పాదయాత్ర చేసినప్పుడు  వైకాపా  అధికారం లోకి రాకపోవడం , ఇక  రెండేళ్ల క్రితం నవరత్నాలను ప్రకటించిన అనంతరం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు .  రాష్ట్ర వ్యాప్తంగా  3, 648 కిమీ సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఆయన వెంట ఎంతోమంది కలిసి  నడిచారు .  అయితే  అనంతపురం జిల్లా కొత్తచెరువు చిన్న పిల్లల వైద్యునిగా ఆసుపత్రి నిర్వహిస్తోన్న హరికృష్ణ మాత్రం , గతం లో  షర్మిల తోపాటు, ఇటీవల  జగన్మోహన్ రెడ్డి వెంట  ఆసాంతం పాదయాత్ర లోపాల్గొన్నారు.


పాదయాత్ర లో పాల్గొన్న హరికృష్ణ… జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చే వినతిపత్రాలు స్వీకరించడమే కాకుండా, జగన్ కు కీలకమైన సమాచారాన్ని అందిస్తూ చేదోడు, వాదోడుగా ఉన్నారు. అవసరైమైన చోట వైద్య సేవలందించిన హరికృష్ణ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , హరికృష్ణ ను తన క్యాంప్ కార్యాలయం ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: