జులై 5 వ తేదీ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎందుకు సమంత సినిమా కోసమా అనే మహానుభావులు ఉంటారు.  అదేం కాదండి బాబు.  జులై 5 వ తేదీన భారతదేశ ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. 

 

ఈ బడ్జెట్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  నిర్మలా ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.  ఎటువంటి పధకాలు ఇందులో ఉండబోతున్నాయి.  ఏ ఏ రాష్ట్రానికి ఎంతెంత ప్రయోజం చేకూరబోతున్నది అనే విషయాలపైనే అందరి దృష్టి నిలిచింది. 

 

మొదటిసారి ఒక మహిళా మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా కావడంతో... ఈ రాష్ట్రాలకు ఏమైనా ప్రయోజనం కలిగించే విధంగా బడ్జెట్ ఉండబోతుందా.. ముఖ్యంగా పోలవరం నిర్మాణం కోసం, రైల్వేల కోసం ఏమైనా బడ్జెట్ కేటాయిస్తున్నారా.  అమరావతి నిర్మాణం కోసం ఏమైనా కేటాయిస్తున్నారు అనే విషయంపై క్యూరియాసిటీ పెరిగింది. 

 

గతంలో మోడీ తెలుగురాష్ట్రాల్లో ప్రచారం చేసినపుడు అనేక హామీలు ఇచ్చారు.  ఈ హామీలను ఈసారైన నెరవేరుస్తానని అందరు ఆశిస్తున్నారు.  ఎందుకంటే, హామీలు నెరవేరిస్తేనే.. మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.  ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.  ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఏదైనా బడ్జెట్ కేటాయిస్తేనే బీజేపీపై గౌరవం పెరుగుతుంది.  మరి చూద్దాం ఎం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: