ఈ ఆధునిక యుగంలో యుద్ధం జరిగితే జరిగే నష్టం అంతాఇంతా కాదు.  అపారమైన నష్టం వాటిల్లుతుంది.  దాని నుంచి బయటపడాలి అంటే ఎంత కష్టమైన పనో అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఎవరు యుద్దాన్ని కోరుకోవడం లేదు. 

 

ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ప్రపంచం క్షణాల్లో కాళీ బూడిదైపోతుంది అనడంలో సందేహం లేదు.  ఇరాక్ యుద్ధంలో అమెరికా చాలా నష్టపోయింది.  ఈ విషయం అమెరికాకు బాగా తెలుసు. ఇప్పుడు ఇరాన్ తో వైరం పెంచుకుంది.  అణు కార్యకలాపాల ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవడంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు క్షీణించాయి. 

 

దీంతో పాటు  గల్ఫ్ లో రెండు ఆయిల్ ట్యాంకర్లుపై దాడి జరగడంతో ఇది ఇరాన్ పనే అమెరికా మండిపడింది.  దీంతో పాటు ఇరాన్ భూభాగంలోకి అమెరికా డ్రోన్ ప్రవేశించిందని చెప్పి మిసైల్స్ తో ఆ డ్రోన్ ను కూల్చివేసింది ఇరాన్.  దీంతో ఇరాన్ పై ఆగ్రహంతో ఊగిపోయింది అమెరికా. 

 

క్షిపణులతో దాడి చేయాలని నిర్ణయించుకుంది.  కానీ, చివరి నిమిషంలో ఆ ఉద్దేశ్యాన్ని విరమించుకుంది. దాడి చేయడం పెద్ద విషయం కాదని అమెరికా హెచ్చరించింది.  ఇరాన్ దానికి ధీటుగా సమాధానం ఇచ్చింది.  ఒక్క తుపాకీ గుండు తమపై దేశంపై పేలినా.. అమెరికా మిత్రపక్ష దేశాలను తగలబెట్టేస్తామని హెచ్చరించింది.  అమెరికా పేరుతో ఇప్పుడు ఇరాన్ ఎవరైనా దాడులకు పాల్పడితే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: