కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో కట్టడాలు కట్టాలి.  ఎందుకంటే అక్కడ పాలన సాగించడానికి భవనాలు లేవు.  దీంతో అక్కడ సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ అంటి వాటిని నిర్మించారు.  అవి తాత్కాలిక భవనాలు.  అయితే, వీటిని ప్రస్తుతం ప్రభుత్వం వినియోగించుకుంటోంది. 

 

అమరావతి నిర్మాణం పూర్తిగా ఇంకా రూపుదిద్దుకోలేదు.  ప్రభుత్వం మారడం వలన వీటిని పక్కన పెట్టి పాలనపై దృష్టిపెట్టింది.  ఇది సరే, తెలంగాణ లో వీటికి సంబంధించిన నిర్మాణాలు అన్ని ఉన్నాయి.  అసెంబ్లీ, సచివాలయం అన్ని ఉన్నాయి. 

 

కానీ, వీటి ప్లేస్ లో ఇప్పుడు కొత్త నిర్మాణాలు ఎందుకు కడుతున్నారో అర్ధం కావడం లేదు.  కొత్త నిర్మాణాలను నిర్మించాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఖర్చు చేయడం అనవసరం.  తెలంగాణా ఏర్పాటు జరిగాక, అప్పులు పెరిగిపోయాయి.  ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నది.

 

ఇలాంటి సమయంలో ఎందుకు కట్టడాల కోసం ఖర్చు చేస్తున్నారో అర్ధంకాని ప్రశ్న.  సచివాలయానికి పట్టుమని కెసిఆర్ ఐదు సార్లు కూడా రాలేదు.  వాస్తు లోపమే కారణం అంటున్నారు.  నమ్మకాలు ఉండొచ్చు.  నమ్మకం పేరుతో ఇలా డబ్బును ఖర్చు చేయడం వలన ఉపయోగం ఏముంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: