ఒక మనిషి ఎదుగుదలకు.. లేదు కుంగిపోవడానికి ఒక మనిషి తీసుకునే నిర్ణయాలే కారణం అవుతుంటాయి.  ఒక్కోసారి మంచి నిర్ణయమే అనుకుంటాం.  కానీ, ఆయా నిర్ణయాలు తప్పని తరువాత తెలుస్తుంది.  ఏది ఏమైనప్పటికి నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ... కానీ, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటమే చాలా కష్టం. 

 

కష్టమైనప్పటికీ.. అనుకున్నది వరకు గట్టిగా నమ్మకంగా ఉంటె విజయం సిద్ధిస్తుంది.  ఇప్పుడు జగన్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.  ఆ ఒక్క నిర్ణయమే.. బీజేపీ బలపడేలా చేస్తున్నది.  వైకాపాలోకి రావాలి అనుకునే నేతలు తమ పదవులకు రాజీనామా చేసి రావాలి.

 

అప్పుడే పార్టీలోకి వచ్చేందుకు డోర్స్ ఓపెన్ అవుతాయి.  లేదంటే మాత్రం ఆంటే సంగతులు.  కానీ, రాజకీయ పార్టీల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం.  అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షాలకు చెందిన నేతలు జాయిన్ కావడం మాములే. 

 

జగనా నిర్ణయం ప్రకారం.. రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఎన్నికలు జరుగుతాయి.  ఎన్నికలు జరిగితే.. పోటీ చేయాలి.  పోటీ చేసి విజయం సాధిస్తామని నమ్మకం లేదు.  పార్టీ మారారు కాబట్టి టిడిపి కార్యకర్తలు సపోర్ట్ చేయరు.  అధికార పార్టీ కార్యకర్తలు ప్రమోట్ చేయరు.  సో, గెలవొచ్చు ... గెలవలేకపోవచ్చు.  దీంతో ఎందుకు వచ్చిన గొడవలే అని చేపి బీజేపీలో జాయిన్ కావడానికి సిద్దపడుతున్నారు నేతలు.  జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే బీజేపీ ఎదుగుదలకు కారణం అవుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: