విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఈయనంత పవర్ ఫుల్ స్వామీజీ బహుశా ఉండకపోవచ్చు. ఎందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరికీ ఈయన అంత్యంత ప్రీతిపాత్రుడు.. ఈ స్వామీజీ కూడా వారిపై అపరిమితమైన ప్రేమ చూపిస్తారు. 


వీరి ప్రేమల సంగతి ఎలా ఉన్నా.. ఈ స్వామీజీకి హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో కోట్లు పలికే రెండు ఎకరాల భూమిని అంత్యంత కారు చౌకగా కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరం 12 కోట్ల వరకూ విలువ చేసే రెండెకరాల భూమిని కేసీఆర్ సర్కారు కేవలం రెండు రూపాయలకు కట్టబెట్టేసింది. అంటే ఎకరం రూపాయి అన్నమాట. 

సాధారణంగా ప్రభుత్వ భూమిని ప్రభుత్వ సంస్థలకు కేటాయించేటప్పుడు కూడా.. నామమాత్రపు ధర వసూలు చేస్తారు. ఇక ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటప్పుడు ఒక్కోసారి మార్కెట్ ధరకు.. ఒక్కోసారి రిజిస్టేషన్ ధరకు ఇస్తారు. కానీ కేసీఆర్ సర్కారు మాత్రం ఏకంగా ఒకే ఒక్క రూపాయికి ఎకరం చొప్పున భూమి కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ఆ భూమిలో దేవాలయం, వేద పాఠశాల వంటివి నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఎంత ఆధ్యాత్మిక సంస్థకు ఇచ్చినా.. కనీసం రిజిస్ట్రేషన్ ధర కూడా వసూలు చేయకుండా.. ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. వడ్డించేవాడు మనవాడైతే.. అన్న సామెత గుర్తుకు వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: