చాలా మంది హీరోయిన్స్ కు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న దాన్ని పాడుచేసుకొని బాలీవుడ్ కు వెళుతూ ఉంటారు. అక్కడే దెబ్బ పడుతుంది. ఇలియానా, తమన్న, అసిన్, శ్రియ, జెనీలియా.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ కు వెళ్లి చేతులు కాల్చుకున్న ముద్దుగుమ్మల బ్యాచ్ చాలా పెద్దది. ఇన్ని అనుభవాలు కళ్లముందు పెట్టుకొని కూడా ఇప్పుడు పూజా హెగ్డే ఈ బ్యాచ్ లో చేరేందుకు తహతహలాడుతోంది. 


నిజానికి పూజా హెగ్డేకు బాలీవుడ్ కొత్తకాదు. అక్కడ ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాతే సౌత్ కు వచ్చింది. ఇప్పుడిక్కడ ఆమె పెద్ద హీరోయిన్. ఇలాంటి టైమ్ లో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేయకుండా మరో హిందీ ఆఫర్ వచ్చిందంటూ అక్కడికెళ్తోంది పూజా. అది కూడా స్టార్ హీరో ఆఫర్ కాదు. ఇంకా చెప్పాలంటే ఓ బి-గ్రేడ్ సినిమా. తెలుగులో ఆమె కాల్షీట్ల కోసం స్టార్ హీరోలంతా వెయిటింగ్. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ సినిమాకు ఆమె ఓకే చెప్పడం కెరీర్ ను నాశనం చేసుకోవడమే అంటున్నారు క్రిటిక్స్.


అంతెందుకు శృతిహాసన్ విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న టైమ్ లో బాలీవుడ్ కు వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు సౌత్ లో మళ్లీ సినిమా ఆఫర్ల కోసం వెయిటింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ లో జెనీలియా, శ్రియ, అసిన్ లాంటి ఎంతోమంది భామలు కళ్లముందు కనిపిస్తారు. వీళ్లంతా సౌత్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన వాళ్లే. బాలీవుడ్ అనే దూరపుకొండను చూసి మోసపోయారు. సౌత్ కు పూర్తిగా దూరమయ్యారు. బాలీవుడ్ లో చేసిన 2,3 సినిమాలతో వీళ్ల కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: