రోజు రోజుకు ప్రపంచంలో పరిణామాలు మారిపోతున్నాయి.  గల్ఫ్ లో జరుగుతున్న పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.  అమెరికా అణు  ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకోవడంతో పాటు ఇరాన్ పై ఆంక్షలు విధించడంతో పరిణామాలు మారిపోతున్నాయి.  


ఇరాన్ లోకి ప్రవేశించిన అమెరికన్ డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసింది. ఈ డ్రోన్ కూల్చివేతతో గల్ఫ్ లో మార్పులు సంభవించాయి.  దీంతో అమెరికా కాలు దువ్వడం మొదలుపెట్టింది.  ఇరాన్ పై బాంబు దాడులు  చేస్తానని భయపెట్టింది.  


ఒకవేళ అమెరికా లాంటి దుశ్చర్యలకు పాల్పడితే... ఇరాన్ ప్రతీకార చర్యగా అమెరికా మిత్రపక్ష దేశాలపై దాడులు చేస్తానని హెచ్చరించింది.  ఇది జరిగితే... మిత్రపక్ష దేశాలు ఊరుకుంటాయా.. దాడులు చేయకుండా ఊరుకుంటారా.. దాడులు చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.  


గల్ఫ్ లో జరుగుతున్న విషయాలపై భారత్ ఆసక్తిగా తిలకిస్తోంది.  ఇండియాకు ముడి చమురు గల్ఫ్ నుంచి వస్తుంది.  గల్ఫ్ లో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తే.. ఇండియాపై కూడా ఎఫక్ట్ పడుతుంది.  తటస్థంగా ఉండాలని అనుకున్నా.. ఇండియా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: