తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కష్టసుఖాల్లో ప్రతిసారి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది క‌మ్మ సామాజిక వ‌ర్గం. టీడీపీకి ముందు నుంచి కొన్ని సామాజిక‌వ‌ర్గాలు అండ‌దండ‌గా ఉంటూ వ‌స్తున్నా కమ్మ సామాజిక వర్గం ఈ పార్టీని ఓన్ చేసుకున్నంత‌గా మిగిలిన సామాజిక‌వ‌ర్గాలు ఓన్ చేసుకోలేద‌న్న‌ది వాస్త‌వం. నాలుగు దశాబ్దాల పాటు ఈ సామాజిక వర్గం నుంచి పార్టీలో ఎంతోమంది ఎన్నో కీలకమైన పదవుల్లో ఎదిగారు. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు వీరంతా రాజకీయంగా తమ భవిష్యత్తు కోసం తమ దారి తాము చూసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఇప్పటికే టిడిపి నుంచి పార్టీ మారిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు ఇద్దరు ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇక గుంటూరు జిల్లా నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ మంత్రితో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే సైతం కమలం వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సుజనాచౌదరి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలను బీజేపీలోకి వచ్చేయండి అంటూ ...అంతా నేను చూసుకుంటానని హామీ ఇచ్చి వారిని బిజెపిలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. 


ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఉన్న కమ్మ కీలక నేతలు సైతం బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం అంటే ఎంతో వీరాభిమానం చూపించే ఈ నేతల్లో పరిటాల కుటుంబం కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే పరిటాల కుటుంబాన్ని ఎక్కడో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా ఒక రేంజ్ లో చూస్తుంటారు.  ఇలాంటి  క‌మ్మ సామాజికవర్గ నేతలు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు వలస వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా ఐదేళ్ల పాటు వీరు జిల్లాలో చేయడానికి ఏం లేదు. ఐదేళ్లుగా సునీత మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని పరిటాల శ్రీరామ్, పరిటాల వర్గం నేతలు చేసిన ఆగడాలు, దౌర్జన్యాలు, దండాలు అన్నీ ఇన్నీ కావు. 


ఇప్పుడు ఆ కేసులన్నీ తోడైతే పరిటాల కుటుంబం, వాళ్ళ అనుచరులు ఐదేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగడానికి టైమ్ సరిపోతుంది. అందుకే వారు వీటి నుంచి తప్పించుకోవడానికి బిజెపి వైపు చూస్తున్నారట. ఇక అనంతపురం జిల్లాకు చెందిన మరో కమ్మ వర్గం తాజా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ధర్మవరం నుంచి 2014లో గెలిచి... గత ఎన్నికల్లో ఓడినా సూరి కోట్లాది రూపాయల కాంట్రాక్టు పనులు చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ క్రమంలోనే ఆయన కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఏపీలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న కమ్మ వర్గం నిట్టనిలువునా చీలేలా ఉందన్నది మాత్రం స్పష్టంగా కనపడుతోంది. అదే టైంలో బిజెపి ఏపీని `కమ్మ` గా క‌మ్ముకుంటూ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: