అవినీతిపై ఈ దేశంలో పోరాటం సాగుతూనే ఉంది. కానీ అది నిరంతర ప్రక్రియగానే ఉంది. పాలకులు అవినీతికి పాల్పడతారని అధికారులు తెగిస్తున్నారు. మరి అధికారులు జనానికి అవినీతిని అలవాటు చేశారు. ఇది చాలా దిగువ స్థాయి నుంచి పాకిపోయింది.


ఈ సమయంలో జగన్ అవినీతి రహిత పాలన అంటున్నారు. అది సాధ్య‌మేనా అన్న సందేహాలు అందరికీ వస్తున్నాయి. ఇక జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకిరించి నెల రోజులు కూడా కాలేదు, ఎమ్మెల్యేలు మాత్రం పూర్వం మాదిరిగానే చాలా చోట్ల వసూల్ రాజా అవతారం ఎత్తేస్తున్నారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇలాగే  ఓ ఇండస్ట్రియలిస్ట్ ని బెదిరించిన కధ జగన్ ద్రుష్టికి వచ్చి మందలించారని టాక్.


అదే విధంగా అనంతపురం జిల్లాలో కూడా పాత పద్ధతిలోనే మామూళ్ళు ఇచ్చేయాలంటూ గెలిచిన ప్రజాప్రతినిధులు బేరాలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ విధంగా చూసుకుంటే జగన్ చెప్పిన అవినీతి రహిత పాలన ఎక్కడ అన్న ప్రశ్న రావచ్చు. జగన్ దగ్గరకు ప్రతీ సమస్యా రాదు, అయన కూడా దేముడు కాడు, అన్నీ చూడడానికి. మరి పార్టీ ఎమ్మెల్యేలు కూడా సహకరించాలి. మొత్తం పార్టీ నాయకులు మారితే ఎంతో కొంత మేలు. అలా జరుతుతుందా..


మరింత సమాచారం తెలుసుకోండి: