భూమిపై రోజు రోజుకు తాపం పెరిగిపోతున్నది.  ఒక్క ఎండాకాలంలోనే కాదు.. ప్రతి కాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి.  తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదు.  దీంతో ప్రజలు తాపంతో అల్లాడుతున్నారు.  దీని నుంచి బయటపడేందుకు ఇబ్బందులు పడుతున్నారు.  


ఎండలతో పాటు.. రసాయనాలు నీళ్లలో కలవడం... ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు ఎక్కువ కావడంతో భూమి మొత్తం ప్లాస్టిక్ మాయం అవుతున్నది.  రోజుకు వేల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ భూమిమీద పేరుకుపోతున్నది.  


కార్లు, ఏసీలు వాడకంతో కార్బన్ పదార్ధాలు బూమిమొత్తం ఆక్రమించేశాయి. మరి కొన్నేళ్లు ఇలా జరిగితే.. ఉష్ణోగ్రతలు 3నుంచి 4 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉంది.  ఉష్ణోగ్రత పెరిగితే.... నీటి మట్టం తగ్గిపోతుంది.  మంచు కరిగి సముద్రాలు పెరిగిపోతుంటాయి.  


ఇప్పటికే సమతుల్యత లోపించింది.  ఎప్పుడు వర్షం పడుతుందో.. ఎప్పుడు పడదో అర్ధం కాదు.  తినడానికి తిండిలేక మనిషి దారుణంగా బాధలు పడుతున్నాడు. మరో 10 పదిహేనేళ్లలో భూమిపై మనిషి మనుగడ ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వస్తుందని అర్ధం అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: