రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ శిల్పారామాన్ని ఏర్పాటుచేస్తామని, సీఎం కేసీఆర్ విజన్‌ను అమలుచేసి తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తామని పర్యాటక, ఎైక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఉప్పల్‌లోని మూసీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన శిల్పారామాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..

 

బడుగు, బలహీనవర్గాలకు ఉపాధి కల్పించి వారికి చేయుతనిచ్చేందుకు శిల్పారామం దోహదపడుతుందని, శిల్పారామంలో శిల్పకళావేదికను నిర్మించేందుకు కృషిచేస్తామని అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతానికి కొత్తశోభను తీసుకొస్తామని, ఈ నదిపై బ్రిడ్జిలను నిర్మించాలని యోచిస్తున్నామని తెలిపారు.

 

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ చొరవతోనే ఉప్పల్‌లో భగాయత్ రైతుల సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ పరీవాహక ప్రాంతం లో శిల్పారామాన్ని ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

 

ఆహ్లాదకరమైన పల్లె వాతావరణం, పచ్చని పరిసరాల్లో ముచ్చటగొలిపే కళాకృతులతో ఈ శిల్పారామం ఏడున్నర ఎకరాల్లో రూ.5 కోట్లతో నిర్మితమైంది. 50 స్టాళ్లతోపాటు ఫుడ్‌కోర్టు, చిల్డ్రన్ ప్లేగ్రౌండ్, వాటర్‌ఫాల్స్‌తో ముస్తాబైన ఈ శిల్పారామం ప్రజలకు ఆటవిడుపుతోపాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేందుకు సిద్ధమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: