సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని, హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు మూడు లేఖలు రాశారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు మోక్షం కల్పించేందుకు ఈ చర్యలు తక్షణావసరమని చెప్పారు.

 

సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. కొత్త కేసులు వస్తుండటంతో ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదన్నారు. వీటి పరిష్కారానికి పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకోవాల్సి ఉన్నదని, ఆర్టికల్ 128, 224ఏ కింద వారి నియామకాలు చేపట్టాలని సీజేఐ సూచించారు.

 

నా విన్నపానికి ప్రాధాన్యం ఇచ్చి సుప్రీంకోర్టును వెంటనే బలోపేతం చేయండి. తద్వారా బాధితులకు సత్వర న్యాయం దక్కుతుంది అని గొగోయ్ పేర్కొన్నారు. గతంలో దామాషా ప్రకారం హైకోర్టుల్లో జడ్జీల సంఖ్య పెంచినా, సుప్రీంకోర్టులో మాత్రం పెంచలేదని చెప్పారు.

 

మోదీకి గొగోయ్ రాసిన రెండో లేఖలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు మూడేండ్లు పెంచాలని, ఖాళీగా ఉన్న జడ్జీల స్థానాలను భర్తీచేయాలని కోరారు. హైకోర్టుల్లో న్యాయమూర్తుల స్థానా లు ఖాళీగా ఉండటంతో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 339 హైకోర్టు జడ్జీ పోస్టులను భర్తీచేయాల్సి ఉన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: