ఒకప్పుడు మనిషి తన పనిని తానూ చేసుకుంటూ వెళ్ళేవాడు.  ఎలాంటి ఇబ్బందులు పడేవాడు కాదు.  ఎప్పుడైతే టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చిందో అప్పటి నుంచే అత్యాశ మొదలైంది. ఇంకా ఎదో కావాలి అనే తపన మొదలైంది.  అప్పటి నుంచి మనిషి పతనం మొదలైంది.  


పతనం నుంచి మనిషి దీనావస్థకు చేరుకుంటున్నారు.  ఎప్పుడు లేని విధంగా ముర్గంగా ప్రవర్తిస్తున్నాడు.  ఏదో కావాలి  అని పరుగులు తీస్తున్న సమయంలో మనిషికి తెలియకుండానే తెలియని మృగ లక్షణాలు అతనిలోకి వచ్చేస్తున్నాయి.  ఒత్తిడి కారణంగా మనిషి తప్పుమార్గంలోకి వెళ్తున్నాడు.  


నిత్యం మనిషికి ఉన్న ఒత్తిడుల కారణంగా మరింత ఆలోచనలు మారిపోతున్నాయి.  చుట్టూ ఉన్న సమాజం ఏమి అనుకుంటుందో అని చెప్పి లొంగిపోయి తన వంచుకొని బ్రతకం ఇష్టం లేక.. నిద్రాణమై ఉన్న శక్తులను తప్పుడు మార్గంలో వినియోగించేందుకు రెడీ అవుతున్నాడు.  


ఫలితంగా మనిషిలో నిద్రాణమై ఉన్న మృగం పైకి లేస్తుంది.  తప్పుడు పనులు చేసేందుకు ప్రేరేపిస్తోంది. చివరకు మనిషిని రాక్షసుడిగా మార్చివేస్తోంది.  ఇంకేముంది చివరకు మనిషి తనకు తెలియకుండానే తెలియని తెలియని విధంగా మారిపోతున్నాడు.  మృగంగా మారిపోతున్నాడు. నేడు జరుగుతున్న అత్యాచారాలకు, హింసలకు ఒత్తిడే కారణం అని సైకాలజిస్టులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: