ఉభయ గోదావరి జిల్లాలో రబీ సాగు కోసం సీలేరు జలాలపై ఆధారపడడం ఆనవాయితీ. కాని, ఈఏడాది ఖరీఫ్‌లోనూ సీలేరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. గోదావరిలో ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో సీలేరు నుంచి నీటినివ్వాలని ఇరిగేషన్‌ శాఖ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అంగీకరించింది.

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు జెన్‌కో సీలేరు జల రిజర్వాయరు నుండి ఏడు వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజులపాటు నీటిని విడుదల చేస్తోంది. ఐదేళ్ల క్రితం ఖరీఫ్‌లో కొనసాగిన వర్షాభావ పరిస్థితులు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కన్పిస్తున్నాయి.

 

జూన్‌ ఒకటో తేదీన నాటికి గోదావరిలో నాలుగు టిఎంసిల నీటి నిల్వలు ఉండటంతో ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువల్లో తగినంత నీరు లేకపోవడంతో రైతులు ఖరీఫ్‌ పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు.

 

ఉభయగోదావరి జిల్లాలకు రబీ సీజన్‌లో సాగుకు, వేసవిలో తాగడానికి సీలేరు జలాలే ఆధారమవుతున్నాయి. సీలేరు నుంచి డొంకరాయి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి గోదావరికి జలాలు అందుతాయి. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాల కాలువలకు ఈ నీటిని విడుదల జెన్‌కో అధికారులు ఈ ఖరీఫ్‌లో గోదావరి డెల్టాలకు అవసరమైన నీరందించేందుకు అంగీకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: