అమ్మ ఒడి.. జగన్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం.. జగన్ హామీ ఇచ్చిన నవరత్నాల పథకాల్లో చాలా ముఖ్యమైంది. పేద తల్లులు తమ పిల్లలను సక్రమంగా బడికి పంపితే చాలు.. ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తానని ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించాడు. 


జగన్ సీఎం అయ్యాక కూడా ఈ పథకంపై ప్రధానంగా దృష్టి సారించారు. మొన్న పాఠశాలల ప్రారంభం వేళ కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని తమ సర్కారు అతి ముఖ్యమైన పథకంగా పేర్కొన్నారు. అయితే ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని ఎవరెవరికి వర్తింప చేస్తారన్న అంశంపై క్లారిటీ కరవైంది. 

ఇంతలో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే అమ్మఒడి వర్తింప జేస్తారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో అప్పుడే జగన్ మాట తప్పారంటూ ప్రత్యర్థి వర్గాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం ఈ పథకంపై క్లారిటీ ఇచ్చింది.

పేద పిల్లల తల్లులు ఏ పాఠశాలకు తమ పిల్లలను పంపినా రూ. 15 వేలు ఇస్తామని.. అమ్మఒడి కార్యక్రమం వర్తింపజేస్తామని సీఎం కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. ఏపీ అక్షరాస్యతలో వెనుకంజలో ఉన్న నేపథ్యంలో తమ సర్కారు అమ్మఒడిని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఎం కార్యాలయం తెలిపింది.

అంటే పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లినా.. ప్రైవేటు బడికి వెళ్లినా ఏడాదికి 15 వేలు ఇస్తారన్నమాట. మొత్తానికి మరోసారి జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడని మరోసారి రుజువైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: