2019 లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించింది.  ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 175 స్థానాల్లో వైకాపా 151 స్థానాలు గెలుచుకొని టాప్ ప్లేస్ లో ఉన్నది.  ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంగాని నెంబర్లను నమోదు చేసుకుంది.  అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 

కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నినాదాన్ని ఎప్పటి నుంచో తలకెత్తుకోవాలని చూస్తోంది.  దేశంలో ఒక్కసారే ఎన్నికలు జరిగితే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు.  డబ్బు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.  ఒక్కోసారి ఒక్కో రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడం కూడా కష్టమే.  


పరిపాలన సరిగా సాగదు.  అభివృద్ధి కుంటుపడుతుంది.  ఈ నినాదంతో బీజేపీ దీనిపై దుష్టిపెట్టి.. ఈనెల 19 వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.  దీనికి అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పాయి.  ఒకేదేశం.. ఒకే ఎన్నికలు నినాదంపై బీజేపీ కమిషన్ వేయాలని చూస్తోంది.  


అడుగు ముందుకు పాడకపోయినా.. కొంతవరకు సక్సెస్ అయినట్టే అని చెప్పాలి.  ఒకవేళ అన్ని పార్టీలు దీనిని ఆమోదిస్తే.. జమిలి ఎన్నికలు జరుగుతాయి.  అన్ని యావరేజ్ న 2022 లో ఎన్నికలు నిర్వహించాలి.  ఇలా చేయడం వలన బీజేపీ చాలా లాభపడింది.  వైకాపా మాత్రం ఇబ్బందుల్లో పడుతుంది.  మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా హామీలు అమలు కావడం అప్పటి వరకు కష్టం.  సో, జమిలి ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: