- అధికార్ల ధూషణలే కారణమా...

కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌) అధికారుల ధూషణలతో పోస్ట్‌గ్రాడ్యూయేట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మెడికల్‌ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ చేసుకుని తన గదిలో అచేతన స్థితిలో ఉండగా సహచర విద్యార్ధులు సకాలంలో గమనించారు. హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు.  ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోనికి వెళ్తే .....


గుంటూరు జిల్లాకు చెందిన ఎస్‌ జగపతిబాబు రంగరాయ వైద్య కళాశాల న్యూరాలజీ విభాగంలో పోస్ట్‌గ్రాడ్యూయేట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నిరుపేద కుటుంభానికి చెందిన అతడు సహచర విద్యార్ధులతో చాలా అనకువగా ఉంటుంటాడని విద్యార్ధులు చెబుతున్నారు. అతడు మెడికల్‌ వార్డ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో కొద్ది రోజులుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా  పురుషోత్తపట్నం నుంచి 48 ఏళ్ల డి సింహాచలం అనే పేషెంట్‌ పెరాలసిస్‌, వైరల్‌ ఫీవర్‌తో రాజమహాంద్రవరం హాస్పిటల్‌ నుంచి వైద్యలు సలహా మేరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు.


రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫోన్‌లో కాకినాడ ఎంపీ వంగా గీత, వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబుకు రికమండ్‌ చేశారు. కాగా శనివారం రాత్రి అతని పరిస్థితి విషమించడంతో ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజక్షన్‌ కోసం సిబ్బంది డ్రగ్‌ స్టోర్‌కు సంప్రదించారు. అయితే స్టాక్‌ లేకపోడంతో చేతులెత్తేశారు. కాగా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ పరిస్థితి విషమించి శనివారం రాత్రి మరణించాడు. అతడి కోసం కొనుగోలు చేసిన రెండు ఇమ్యునోగ్లోబిన్‌ ఇంజక్షన్‌లు మిగిలిపోడంతో వాటిని వేరొక వైద్యుడు సింహాచలంకు చేసి అతడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.


రాత్రి విధులకు హాజరైన పోస్ట్‌గ్రాడ్యూయేట్‌ విద్యార్థి జగపతిబాబుకి ఈ విషయం సంబంధిత డ్యూటీ డాక్టర్లు చెప్పకపోడంతో ఇమ్యునోగ్లోబిన్‌ ఇంజక్షన్‌ కోసం ఎంక్వైరీ చేశాడు. జీజీహెచ్‌లో ఆ ఇంజక్షన్‌ నిల్వలేదని చెప్పడంతో పేషెంట్‌  కుటుంభ సభ్యలను అప్రమత్తం చేశాడు..పేషెంట్‌ను త్వరగా బయటకు తీసుకువెళ్లి ప్రాణాపాయం నుంచి కాపాడాల్సిందిగా సూచించారు. ఐతే ఈ విషయాన్ని పేషెంట్‌ కుటుంభ సభ్యులు జీజీహెచ్‌ ప్రధానాధికారి (సూపరింటెండెంట్‌) కి తెలియజేరస్తూ , భయటకు వెళ్లిపోవాల్సిందిగా చెబుతున్నారన్నారు.


దాంతో ఆగ్రహించిన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాఘవేంద్రరావు సంబంధిత విద్యార్థి జగపతిబాబును పిలిచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు బాధితుడు  చెబుతున్నాడు. పీజీ సర్టిఫికెట్‌ కేన్సల్‌ చేస్తానని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు తన హాస్టల్‌ గదిలోనే ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు మాట్లాడుతూ పేషెంట్‌ బతకడని, ఇంజక్షన్‌ చేయటం అనవసరమని పీజీ విద్యార్ధి చెప్పడంతో అతడిని మందలించినట్టు చెబుతున్నారు.  విధులలో ఉన్నప్పుడు అజాగ్రత్త, అశ్రద్ద వహించటం సరైందికాదని హితవుపలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: