లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా ) కి ఇవ్వాలని బీజేపీ నేతృత్వం లోని ఎన్డీఏ సర్కార్ భావిస్తున్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే  బీజేపీ ఇస్తున్న ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాలని వైకాపా నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ని స్వీకరిస్తే, బీజేపీ తో అంటకాగమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ఇది పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎంతమాత్రం మంచి కాదని వైకాపా నాయకత్వం భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వైకాపా ప్రభంజనం సృష్టించింది.ఏకంగా ఆ పార్టీ 22 ఎంపీ స్థానాలను గెల్చుకుని పార్లమెంట్ లో నాల్గవ అతి పెద్ద పార్టీగా నిలిచింది.


దీనితో వైకాపా కు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయాలని  బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఈ విషయాన్ని బీజేపీ నేతలు అధికారికంగా వైకాపా నేతలకు చెప్పకపోవడం, ఒకవేళ చెప్పిన తాము ఆ పదవిని సున్నితంగా తిరస్కరించడమే బెటరన్న నిర్ణయానికి వచ్చారు.డిప్యూటీ స్పీకర్ పదవి కేవలం అలంకారప్రాయమేనని , దాని వల్ల  పార్టీకి ఒరిగే ప్రయోజనం ఏది ఉండకపోగా, తాము బీజేపీ తో అంటకాగమనే అపవాదును మోయాల్సి వస్తుందని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి . 


లోక్ సభ  డిప్యూటీ స్పీకర్ పదవి తమ పార్టీ స్వీకరించాలంటే, ఆంధ్ర ప్రదేశ్ కు  ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధాని మోదీ , బీజేపీ జాతీయాధ్యక్షుడు , కేంద్ర హోం మంత్రి అమిత్ షా లను జగన్మోహన్ రెడ్డి కోరనున్నారని వైకాపా వర్గాలు తెలిపాయి . ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్న బీజేపీ నేతలు , జగన్మోహన్ రెడ్డి విధించే షరతుతో మారుమాట్లాడే అవకాశం లేక మైండ్ బ్లాకవడం ఖాయమని వారు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: