ఆంధ్ర ప్రదేశ్‌ పత్రిక వివాదం పై సంసాదక వర్గంలో పనిచేస్తున్న నరేష్‌ నున్నా ఇలా ంటున్నారు '' పెద్దస్థాయిలో ఉన్న వ్యక్తులు అందించినట్టుగా చెప్పబడుతున్న ఈ సమాచారం నాకు ఆశ్చర్యాన్ని, కొంత ఆనందాన్ని కలిగించాయి. ఆంధ్రప్రదేశ్‌ పత్రికలో వచ్చిన తప్పిదాలు, ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి గారి స్థాయికి వెళ్ళి మరీ ఆయనకు చీదర కలిగించడమంటే సామాన్యమైన విషయం కాదు.

 ''యెడుగూరి సందింటి జగన్మోహన్‌ రెడ్డి అనే ఆ అతను...!'' ...ఈ హెడ్డింగ్‌ పెట్టింది, ఈ రిపోర్ట్‌ రాసింది నేనే కాబట్టి, నేను సంజాయిషీ ఇవ్వొచ్చు. 

జగన్‌ అనే నేను - అనే ఎందుకు పెట్టాలి? ప్రమాణ స్వీకారం మీద రిపోర్ట్‌ చేస్తున్న నేను, శ్రీ జగన్మోహన్‌ రెడ్డి ని గానే రాస్తాను. జగన్‌ అనే ఆయన - అనడం గా ఉంటుంది నాకైతే. అతడే ఓ సైన్యం.

అంతటి విజయహేలలో... ప్రమాణస్వీకార వేళలో.... వై ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనే ఆ యువనేత గొంతు కొద్ది క్షణాలు వణికింది... ఒకించుక గద్గదమయ్యింది! ఉల్లాసం... ఉత్సాహం... పొంగిపొర్లే ఆ సమయంలో ఎందుకా ఉద్వేగం??!! ఎందుకంటే, ప్రమాణస్వీకారమంటే పట్టాభిషేకం అని వై ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనే యువ ముఖ్యమంత్రి పొరబడలేదు కాబట్టి. ఒక రాష్ట్రానికి బాధ్యుడిగా, ఆరుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకి ప్రతినిధిగా తనకి దక్కిన పదవి, అందిన అధికారం- పెద్ద బాధ్యత... పెను సవాల్‌ అని తెలుసు కాబట్టే ఆ ఉద్వేగం!''

- ఈ లీడ్‌ చదివాక, 'ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఏడ్చారు'- అని పత్రికలో రాసారని అనడం, దానికి జగన్‌ అభిమానులు కలత చెందారని, ఆగ్రహోదగ్ధులౌతున్నారని రాయడం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. '' అని నరేష్‌ తన ఫేస్‌బుక్‌ వాల్‌ పై వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: