జగన్ అందరిలాంటి రాజకీయ నాయకుడు కాడు, ఆయన నవ్వుతూనే తన పని కానిచ్చేస్తారు. తాను చేయాలనుకున్న దాని మీద  పక్కా క్లారిటీగా ఉంటారు. ఆయన మీద ఎవరి ప్రభావమూ ఉండదు, జగన్ కచ్చితంగా ఓ నిర్ణయానికి వస్తే ఆయన్ని ఆపడం ఎవరి తరం కాదని కూడా అంటారు.


ఇదిలా ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా అన్నది జగన్ నినాదం. హోదా కోసం  ప్రతిపక్ష హోదాలో అయిదేళ్ళ పాటు పోరాడిన యువ నేత ఇపుడు ముఖ్యమంత్రిగా  ఉంటున్నారు. ఆయన గత నెల రోజుల వ్యవధిలోనే అనేక సందర్భాలలో హోదా గురించి అడిగి మోడీని విసిగించేశారు. అయినా సరే బీజేపీ హోదా వూసు ఎత్తడంలేదు.


ఈ లోగా వైసీపీని బుట్టలో వేసుకునేందుకు అనేక తాయిలాలు కూడా ప్రకటిస్తోంది. ఏపీలో  కోటాలో మంత్రి పదవుల ఖాళీలు అలాగే  ఉన్నాయి. మరో వైపు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి మోడీ షా ఆఫర్ చేసినట్లుగా న్యూస్ వైరల్ అయింది. దానికి జగన్ అలాంటిందేమీ లేదని ఖండించినా కూడా  నిజానికి బీజేపీ తనకు తానుగా  ఈ ఆఫర్ ఇచ్చిందట.


 ప్రత్యేక హోదాయే మాకు ముద్దు. ముందు దాని సంగతి తేల్చండి ఆ తరువాతే మంత్రి పదవులు అయినా, మరేదైనా అంటూ డిప్యూటీ స్పీకర్ ఆఫర్ ని జగన్ నాయకత్వంలోని వైసీపీ గట్టిగానే తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. చూడాలి మరి మోడీకే షాక్ ఇచ్చేసిన జగన్ విషయమో కేంద్రం ఎలా స్పందిస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: