చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయన దేశానికి ప్రధాని కావాల్సిన వారు. దేశంలోకెల్లా సీనియర్ మోస్ట్ లీడరు, ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. అంతటి వారు ఏపీలో కీలక నేతగా ఉండడం అద్రుష్టమని టీడీపీ వారు ఢంకా భజాయిస్తారు.


అయితే వైసీపీకి మాత్రం బాబుతో ఆడుకోవాలనిపిస్తోంది. అందుకే అర్జంట్ గా ఉండవల్లి ప్రజావేదిక భవనాన్ని స్వాధీనం చేసుకుని బాబుకు చేతల్లో సమాధానం చెప్పేశారు. ఇక కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన లింగమనేని ఎస్టేట్స్ లో బాబు కాపురం ఉండడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. అంటే రేపో మాపో అక్కడ కూడా బాబు గారికి చోటు ఉండదని తేల్చేశారన్న మాట.


ఇక మరో కీలక విషయం ఏంటంటే విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ని కూడా జగన్ సర్కార్ స్వాధీనపరచుకుని దాన్ని రాజ్ భవన్ గా తీర్చిదిద్దుతుందట. ఏపీకి తొందరలో కొత్త గవర్నర్ వస్తారని, ఆయనకు నివాసంగా రాజ్ భవన్ గా ఈ క్యాంప్ ఆఫీస్ ని తీర్చిదిద్దాలని జగన్ ప్రభుత్వం అనుకుంటోందిట. 


నిజానికి ప్రజావేదిక నిర్మాణం కాకముందు చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించేవారు. ఇపుడు ఈ భవనాన్ని ప్రతిపక్ష నేత కోసం అడగాలన్న ప్రతిపాదన టీడీపీ వద్ద ఉండగానే జగన్ పై ఎత్తు వేసి మరీ దాన్ని రాజ్ భవన్ గా మార్చబోతున్నారట. మొత్తానికి చూసుకుంటే బాబుకు బాగా బిగించేస్తున్నారు. ఆయనకు ఇప్పటికిపుడు అద్దె ఇల్లు తప్ప మరేమీ మార్గం లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: