జగన్ అధికారంలోకి వచ్చాక అవినీతిపై కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతి ఎక్కడ జరిగినా సరే.. వాటిపై దృష్టిపెట్టి వాటిని కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు జగన్.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కూడా జగన్ ఇలాంటి ఆలోచనలే చేస్తున్నారు.  


గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీసుకురావడానికి ఇప్పటికే కమిటీలు వేశారు.  ఒక్కొక్క శాఖలో కాకుండా.. అన్ని శాఖల్లో ఎక్కడెక్కడా ఎలాంటి ఎలాంటి అవినీతి జరిగింది అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.  అవినీతి ఎక్కడ జరిగినా దానిని అస్సలు వదలకూడదు అని నిర్ణయించుకున్నారు.  


జగన్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఇదిలా ఉంటె, ఇక సొంతపార్టీలోని కొంతమంది సభ్యులు అవినీతిని చూసి చూడనట్టు కొంతకాలం కళ్ళు మూసుకొని ఉండాలని, వాటి గురించి పక్కన పెట్టాలని సూచనలు ఇస్తున్నారని ఆరోపించారు.  


ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని.. ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం చెప్తామని అంటున్నారు.  సొంతపార్టీ వాళ్ళైనా సరే అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే.. సహించబోమని అంటున్నాడు.  జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరిని శభాష్ అనిపిస్తున్నది.   


మరింత సమాచారం తెలుసుకోండి: