చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఏడాదిన్నర ముందు బీజేపీ తో తెగతెంపులు చేసుకొని బయటకు వచ్చాడు.  అలా రావడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని బీజేపీపై దుమ్మెత్తి పోశాడు.  అక్కడితో ఆగకుండా వరసగా మోడీపైనా, అమిత్ షా పైనా విమర్శలు చేశాడు. 

ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన చంద్రబాబుకు ఊహించని దెబ్బ పడింది.  రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రాగా, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది.  సెంట్రల్ లో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు అయోమయంలో పడిపోయాడు. 

 

కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో బాబుకు ఎం చేయాలో అర్ధంకాలేదు.  బాబుతోనే ఉంటె కష్టం అవుతుందని అనుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీవైపు వెళ్లేందుకు ట్రే చేస్తున్నారు.  ఇప్పటికే కొంతమంది నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. 

 

 త్వరలోనే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  వీళ్ళ  చేరిక తరువాత బాబుకు మోడీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట.


మరింత సమాచారం తెలుసుకోండి: