తాజాగా బిజెపిలోకి ఫిరాయించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అపుడే జోకులేయటం మొదలుపట్టేశారు. దేశాభివృద్ధి కోసమే తాను టిడిపిలో నుండి బిజెపిలోకి మారినట్లు చెప్పటం నిజంగా పెద్ద జోకనే చెప్పాలి.  టిడిపిలో ఉన్నపుడు కూడా తన దృష్టంతా అభివృద్ధిపైనే ఉండేదట.

 

తెలుగుదేశంలో సుజనా దాదాపు పదేళ్ళ పాటు ఉన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగానే ఉన్నారు. అందులో కూడా సుమారుగా మూడేళ్ళు కేంద్రమంత్రిగా పనిచేశారు. నిజానికి సుజనాకు పార్టీ జనాలతో ఏమాత్రం సంబంధం లేదు. ఏమన్నా ఉంటే చంద్రబాబునాయుడు తరపున పార్టీ నేతలతో మాట్లాడి పనులు చక్కబెట్టటమే.


సుజనా వ్యవహారం ఎప్పుడు తెరవెనుక మంత్రాంగానికి పరిమితం. ఎందుకంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఓట్లేసేవాళ్ళు ఎవరూ లేరు. పార్టీ నేతలు కూడా ఆయన పెత్తనాన్ని సహించరు. అందుకనే ఆయన కూడా తెరవెనుకకే పరిమితమయ్యారు. చంద్రబాబు-సుజనా మధ్య ఉన్నది కేవలం ఆర్ధిక బంధం తప్ప మరోటి లేదు.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడు అందించిన ఆర్ధిక వనరులకు బదులు సుజనాను చంద్రబాబు రాజ్యసభ ఎంపిని చేశారన్న విషయం అందిరికీ తెలుసు. ఈ మాత్రం దానికే తాను రాష్ట్రాభివృద్ధికి చాలా త్యాగాలు చేసానన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు.

 

నిజానికి కేంద్రంలో, రాష్ట్రప్రభుత్వంలో ఉన్న పలుకుబడి కారణంగా వేల కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి దోచేశారు. ఇపుడు ఆ కేసులే సుజనా పీకలకు బాగా చుట్టుకున్నది. సిబిఐ ఏ రోజైనా అరెస్టు చేస్తుందన్న భయంతోనే టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించారు. అలాంటిది దేశాభివృద్ధి కోసమే తాను బిజెపిలోకి చేరానంటూ అప్పటికి తానేదో పెద్ద త్యగరాజన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: