ప్రకాశం జిల్లాలో చిన్న పిల్ల పై సామూహిక అత్యాచారం అంధ్ర ప్రజలను తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురి చేసింది. గదిలో నిర్బంధించి పదహారేళ్ల బాలికపై ఆరుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు.ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీవరకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. . ఒక ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడిన అమ్మాయి అతడిని వెతుక్కుంటూ ఒంగోలు వచ్చిన నేపధ్యంలో ఓ వ్యక్తి ట్రాప్ చేశాడు. మిత్రుడి వద్దకు చేరుస్తానంటూ నమ్మించి తనతో తీసుకుని వెళ్లి ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు.


అతడితోపాటు మరో ఐదుగురు యువకులు ఆమెపై నాలుగు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం అనుమానాస్పద స్థితిలో కనిపించిన బాలికను ఒంగోలు పోలీసులు గుర్తించి ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులలో ఇరువురు ఇంటర్మీడియెట్‌ చదివిన యువకులని, మరో నలుగురు యువకులు ఇంజనీరింగ్‌ విద్యార్థులని ప్రాథమికంగా తెలుస్తోంది.


ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ ఇప్పటికే తమ సిబ్బందిని రంగంలోకి దించామని, ఆరుగురు నిందితులను గుర్తించామని వారిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇక ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ ఎనిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. గతంలో వై ఎస్సార్ హయాంలో వరంగల్ లో స్వప్నిక ,ప్రణీతలపై జరిగిన యాసిడ్ దాడి కేసులో యాసిడ్ దాడి నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా జగన్ బాలికల మరియు మహిళల రక్షణ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: