వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక... ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.  ముఖ్యంగా తన పథకాల్లో మహిళలకు ప్రాధ్యాన్యత ఇస్తున్నాడు.  ఇలా ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి.  అవెందుకో ఇప్పుడు చూద్దాం. 

 

పింఛన్ పధకంలో తాత అవ్వలకు ప్రాధాన్యత కల్పిస్తూ పింఛన్ సౌకర్యం ఏర్పాటు చేశారు.  ఈ పధకం ద్వారా ప్రతి నెల 2,250 రూపాయలు పింఛన్ కింద అందుతుంది.  దీంతోపాటు, ఆశా వర్కర్ల జీతాన్ని 3 వేల నుంచి 10వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

ఇది మహిళలకు మేలు చేసే పథకమే.  కాయా కష్టం చేసే మహిళలకు ఇది ఒక వరం లాంటిది.  దీంతో పాటు అమ్మఒడి పధకం కింద 15వేల రూపాయలు ప్రతి తల్లికి అందించబోతున్నారు.  ఈ పథకం సక్సెస్ అయితే జగన్ పరపతి పెరుగుతుంది.  అలాగే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పధకం కింద రుణాలను మాఫీ చేస్తున్నారు. 

 

దీంతోపాటు, మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తూ చేసేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  అలాగే గ్రామా వాలంటీర్ల నియామకంలో 50 శాతం మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అంటే 4 లక్షల నియామకాల్లో రెండు లక్షల మంది మహిళలకు అవకాశం కల్పించబోతున్నారు.  ఇది గ్రేట్ అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: