రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది... గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా తర్వాత ఇప్పుడు మరో కొత్త వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే గట్టి షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య తన పదవీ కాలానికి ఆరు నెలల ముందే రాజీనామా చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పొసగక గతంలో ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారనే ప్రచారం సాగగా.. ఇప్పుడు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామాకు సిద్ధమయ్యారు. 

ఆర్బీఐలో అతి పిన్న వయస్కుడైన డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యే కాగా... తన పదవీకాలం ముగియడానికి మరో ఆరు నెలల ముందు రాజీనామా చేస్తున్నారు. ఆర్‌బీఐకి స్వతంత్రత, స్వయంప్రతిపత్తి ఉండాలని గట్టిగా కోరినవారిలో విరాల్ ఆచార్య ఒకరు. కాగా, ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని జాతీయ మీడియా పేర్కొంటోంది. 2017 జనవరి 23న ఆర్బీఐలో చేరిన ఆయన.. ఆర్థిక విధానాల సరళీకరణ తర్వాత నుంచి చూస్తే యంగ్ డిప్యూటీ గవర్నర్ ఈయనే.. విరాల్ ఆచార్య పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత న్యూయార్క్‌లోని స్టెర్న్ బిజినెస్ స్కూల్‌లో విద్యార్థులకు బోధించనున్నారు.

గతంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య కూడా తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగటంతో విరల్ ఆచార్య రాజీనామా వార్తలపై ఆర్బీఐ అధికార ప్రతినిధి స్పందించారు. విరల్ ఆచార్య రాజీనామా వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు విరాల్ ఆచార్య రాజీనామా వార్తల నేపథ్యంలో వచ్చే నెల పదవీ బాధ్యతల నుంచి వైదొలగనున్న సీనియర్ డిప్యూటీ గవర్నర్ ఎన్. విశ్వనాథన్‌ను మరికొన్ని నెలలు కొనసాగమని కేంద్రం కోరే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: