తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి , బీజేపీ నాయకుడు ఐ వై ఆర్ కృష్ణారావు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయం లో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొండను తవ్వుతానని అంటున్నారని ... కొండను తవ్వి ఎలుకను కాదు కదా ... చిన్న చీమ , దోమ ను కూడా పట్టలేరంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు , పార్టీ నేతలతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐ వై ఆర్ స్పందిస్తూ కొండే అవినీతిమయం  అయినప్పుడు , ఇక కొండను తవ్వి ప్రత్యేకంగా నిరూపించాల్సింది ఏముంటుందని ఎద్దేవా చేశారు.


చంరబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో ఐ వై ఆర్ కృష్ణారావు 2014 నుంచి 2016 వరకు రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా కొనసాగారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసిన తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత, ఆనాటి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని బ్రాహ్మణ  కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కొనసాగే సమయం లో ఐ వై ఆర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టింగులు , ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిణమించడం తో ఆయన పై ప్రభుత్వం వేటు వేసింది.


ప్రభుత్వ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని ఐ వై ఆర్ , ఆతరువాత కూడా టీడీపీ ప్రభుత్వ హయం లో జరిగిన అవినీతి, అమరావతి నిర్మాణం లో చోటు చేసుకున్న అక్రమాలపై తనదైన శైలి లో విరుచుకుపడుతూ ... బాబు సర్కార్ కు కంట్లో నలుసుగా మారారు . బ్యూరోక్రాట్ నుంచి బీజేపీ లో చేరి రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన ఐ వై ఆర్ , బాబు ను లక్ష్యంగా చేసుకుని తరుచూ విమర్శలు సంధిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: