ఈ మద్య నాయకులంటే ఎన్నికల సమయంలో దర్శనమిచ్చి..ఓటర్లను ఏదో ప్రలోభ పెట్టి ఓట్లేయించుకున్న తర్వాత కంటికి కనిపించకుండా పోతున్నారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇది అందరికీ వర్తించదని..కొంత మంది రాజకీయ నాయకులు మనసున్నమారాజులని పలుమార్లు రుజువు చేసుకున్నారు.  దేశ వ్యాప్తంగా కొంత మంది రాజకీయ నేతలు ఎంతో నిడారంబరంగా ఉంటూ ప్రజలతో మమేకమవుతుంటారు.  ఆంధ్రప్రదేశ్ లో సీఎం స్థాయిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ తన కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో ఎవరైన బాధితులు కనిపిస్తే అక్కడే ఆపి వారి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించడానికి పురమాయిస్తున్నారు. 


ఆ మద్య వైజాగ్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ క్యాన్సర్ బాధితుడి తరుపు నుంచి కొంత మంది విద్యార్థులు వచ్చి తమ సమస్య విన్నవించుకుంటే, వెంటనే కలెక్టర్ ని పిలిపించి అతడికి రూ.25 లక్షలు మంజూరు చేసి ఆపరేషన్ తో పాటు ఇతర విషయాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.  తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు.


ఒక అనాథ అమ్మాయి కన్యాదానం చేశారు.  బహుదూర్‌పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పెరిగిన పుష్పను విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం చేయించారు.  ఆమెకు తల్లిదండ్రుల స్థానంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. అమ్మాయి భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఆమె పేరున రూ.235000 ఫిక్స్‌డిపాజిట్ పత్రాలను అందజేశారు. అంతేకాదు రూ.25వేల నగదును నూతన దంపతులకు మంత్రి కానుకగా అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: