టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో పాటు మరో ఇద్దరు బీజేపీలో చేరడంపై కమలం పార్టీలో అసంతృప్తులు మొదలయ్యాయి. వారి చేరికతో వారికెక్కడ ఎసరు పెడతారో అని తీవ్ర వ్యతిరేకత మొదలైంది.  చూడాలి మరి అధిష్టానం ఏం చేస్తుందో..

 

అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా ఖండించకపోయినప్పటికీ కొందరు నేతలు ఏపీలో పార్టీ భవిష్యత్‌పై లోలోన మదన పడుతున్నట్లు సమాచారం. అమిత్ షా నిర్ణయాన్ని వ్యతిరేకించలేని ఏపీ బీజేపీకి చెందిన కొందరు నేతలు సన్నిహితుల వద్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారట.

 

టీడీపీ నుంచి వచ్చే వారిని బీజేపీలో చేర్చుకోవద్దని తాము చెప్పడం లేదని.. అయితే సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను పార్టీలోకి తీసుకుంటే పార్టీపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్నదే తమ అభిప్రాయమని ఏపీ బీజేపీ నేతల్లో కొందరు వాపోతున్నారట.

 

అవినీతిపరులకు బీజేపీ ఆశ్రయమిస్తుందన్న ప్రచారం జరిగితే పార్టీ నష్టపోతుందని వారు చెబుతున్నారట. అయితే.. ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి సహకరించి ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏపీ బీజేపీలో కనిపిస్తోంది. ఇక చూడాలి వాట్ విల్ హాపెన్!


మరింత సమాచారం తెలుసుకోండి: