ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్  వల్ల  ఆ పార్టీ కి పెద్దగా ప్రయోజనమేది  ఉండే విధంగా కన్పించడం లేదు. ఏపీ లో బలపడాలనుకుంటున్న ఆ పార్టీ ప్రజాకర్షణ ఉన్న నేతలను, మాస్ కి మంచి పట్టున్న వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుండేది. కానీ ఆర్ధిక నేరారోపణలు , కేసుల భయం తో బిక్కు, బిక్కుమంటున్న వారిని ఎందుకు తమ పార్టీలోకి ఆహ్వానించిందో, ఎంత  బుర్రలు బద్దలు కొట్టుకు న్నా,  ఇప్పటికీ రాజకీయ పరిశీలకులకు అంతుచిక్కడం లేదు.


రాజ్యసభ లో తమ మెజార్టీ ని పెంచుకునేందుకు టీడీపీ కి చెందిన నల్గురు ఎంపీ లను తమవైపు తిప్పుకున్నట్లు కన్పిస్తున్నా , ఆ పార్టీ కి ఏపీ లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని ప్రైవేట్ సంభాషణల్లో ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి , మరో రాజ్యసభ సభ్యుడు  సీఎం రమేష్ లపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే .  ఈ తరుణం లో కేంద్రం లో అధికారం లో ఉన్న తమ  పార్టీ లో చేర్చుకోవడం ద్వారా ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్తాయన్న విషయాన్ని బీజేపీ అగ్ర  నేతలు అసలు  పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని అంటున్నారు.


ఏపీ బీజేపీ బలోపేతమే లక్ష్యమైతే , సుజనా , సీఎం రమేష్ లు పెద్దగా ప్రజాధారణ లేని నాయకులని, వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది లేదన్నారు . అటువంటప్పుడు వారి చేరిక తో రాష్ట్రం లో పార్టీ ఎలా బలోపేతం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపులను ఏపీ ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని , ఆ విషయం అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా రుజువయింది చెబుతున్నారు. గతం లో టీడీపీ చేసిన తప్పే , ఇప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: