ప్రజలే మన దేవుళ్లు..వారి నమ్మకాన్ని గెలవడం అంత సులభం కాదు, కష్టపడాలి నేనున్నానని భరోసా ఇవ్వాలి, వారి కష్టాలను దూరం చేయడానికి ప్రయత్నించాలి..దూరం చేయాలి.  అప్పుడే ప్రజలు నాయకులను నమ్ముతారు..ఎన్నికల్లో గెలిపిస్తారు.  ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి నేను ఎన్నో నేర్చుకున్నానని..ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వారు ఎలా బుద్ది చెబుతారో గత పాలకులు ఆ అనుభవాన్ని చూశారని..ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదని ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  


వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నామని..మేనిఫెస్టో అన్నది భగవద్గీతలాంటిది అని అన్నారు.   ప్రజా వేదిక నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చి వేత ప్రారంభిద్దాం, ఈ పని ఎల్లుండి నుంచే ప్రారంభిద్దాం అని అన్నారు. మనం పాలకులం కాదు..సేవకులం అని ప్రతి ఒక్క నేత, అధికారులు భావించాలి అన్నారు.  ప్రస్తుతం మనం ఇల్లీగల్ భవనంలో ఇంత మంది అధికారులం సమావేశం అయ్యామని..అక్రమాల గురించి చెప్పడం కాదు..వాటిని సమూలంగా నిర్మూలించాలి, అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని సీఎం జగన్ అన్నారు. 

నాటి వ్యవస్థ ఎలా దిగజారిందో తెలుగుసుకోవడానికి ఇక్కడికి అందరినీ పిలిపించానని...ప్రజా వేధికపై సీరియస్ గా కామెంట్స్ చేశారు ఏపి సీఎం. సోమవారం కలెక్టరేట్లు సహా ప్రతి కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించాలి. స్పందన పేరుతో ప్రజల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించాలి. నిర్ధిష్ట కాల వ్యవధిలో ఫిర్యాదుల్ని పరిష్కరించాలి.పట్టాలు ఇచ్చేటపుడు ఫ్లాటు ఎక్కుడుందో చూపించండి..పట్టా ఇచ్చారు, ఫ్లాటు ఎక్కడుందో తెలీదని ఎవరూ అనకూడదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: