ఉండవల్లిలోని ప్రజావేదిక లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.  ఇక నుంచి ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే.  స్పందన పేరుతో కార్యక్రమం ప్రజలు వినతి పత్రాలు తీసుకుని కార్యాలయాలకు వస్తే ముందుగా చిరునవ్వుతో స్వాగతం పలకండి. ప్రతి సమస్యకు నిర్ణీత వ్యవధిలో పరిష్కారం చూపాలి.

ప్రతి నెలా మూడో శుక్రవారం కాంట్రాక్టు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయించండి.  ఐఏఎస్ అధికారులు జిల్లాలో ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు చేయాలని అన్నారు. 

హాస్టల్స్, పిహెచ్ సీలలో నిద్రించండి. అర గంట ముందు నిద్రించే ప్రాంతాన్ని ఫిక్స్ చేసుకోండి. అంతే గాని ఫలానా చోటికి వస్తున్నామని ముందే చెప్పి అక్కడ నిద్రించేందుకు ఏర్పాటు చేసుకోవద్దు. ఉదయాన్నే లేవగానే స్థానికులతో నవరత్నాల అమలు గురించి చర్చించండి. సమస్యలు వినండి.


మరింత సమాచారం తెలుసుకోండి: