రైల్వే టిక్కెట్ల బుకింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తత్కాల్‌ టిక్కెట్లను కొందరు ప్రైవేటు వ్యక్తులు సెకన్ల వ్యవధిలోనే మాయం చేస్తున్నట్లు అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి.

 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో.. ప్రత్యేకించి గుంటూరు, నరసరావుపేట, సికింద్రాబాద్‌ కేంద్రాలుగా ఈ ప్రహసనం నడుస్తున్నట్లు రైల్వే అధికారుల అంతర్గత విచారణలో బయటపడింది.

 

ఇతర జోన్లలోనూ ఏడాది నుంచి లక్షల్లో తత్కాల్‌ టికెట్ల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో కొందరు నెట్‌ సెంటర్ల నిర్వాహకులు ఓ ముఠాగా ఏర్పడిన ట్లు అధికారులు భావిస్తున్నారు. ఐపీ చిరునామాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని నెట్‌ సెంటర్ల నిర్వాహకులకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు.

 

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లతో ఈ ప్రహసనాన్ని నిలువరిస్తున్నారు. అధికారుల ప్రయత్నాలకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కూడా ప్రశంసలు అందాయి. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసి ఈ అవకతవకలను శాశ్వతం గా నివారించే దిశగా అధికారులు దృష్టి సారించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: