‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలన్నారు.

 

మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. నా ద్వారా మీకు అధికారం ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఇంత మెజారిటీ ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి.. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలి. రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకుని ఓట్లు అడగాలి.

 

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు ఇవేవి చూడకుండా ఈ పథకాలు అందజేయాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వద్దంటే పట్టించుకోవద్దు. మనకు ఓటు వేయనివారికి కూడా మంచి చేయాలి. మనం చేసిన మంచితో వారు మళ్లీ ఓట్లేసేలా చేసుకోవాలి. ఎన్నికలయ్యేవరకే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అందరు మనవాళ్లే.

 

ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో  గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్‌ తీసుకుంటారు. ప్రతి సంక్షేమ పథకాన్ని డోర్‌ డెలివరీ చేస్తారు. ఇది చేసేటప్పుడు గ్రామ వాలంటీర్‌ అవినీతికి పాల్పడవద్దు. వివక్ష చూపవద్దు. ఇలా చేయవద్దని రూ.5వేల జీతం ఇస్తున్నాం. అని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: