ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్ కు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉక్కిరి, బిక్కిరి అవుతోంది. ఎప్పుడు ఏ నాయకుడు చేజారుతాడో, ఏ ఎమ్మెల్యే పార్టీ మారాడన్న వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతోంది. ఆ పార్టీ నాయకులు ఊహించినట్లుగానే, సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మల్యే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబికా కృష్ణ కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.


సోమవారం సాయంత్రం హస్తిన లో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షం లో అంబికా కృష్ణ బీజేపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన హస్తిన బాట పట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుంటే , టీడీపీ నాయకత్వం ఆర్చి , గగ్గోలు పెడుతుందని భావిస్తోన్న కమలనాథులు రెండవ వైపు నుంచి ఆ పార్టీ పునాదులు కదిలించే ప్రయత్నాన్ని ప్రారంభించారు.


టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన  ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులు , ఇటీవల ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించక నాయకత్వం పై  అసంతృప్తి తో రగిలిపోతున్న వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే అంబికా కృష్ణ ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం వేసిన  ఎత్తుగడ సక్సెస్ అయిందని కమలనాథులు చెబుతున్నారు. అంబికా కృష్ణ పార్టీ వీడనున్నారన్న  విషయం తెలుసుకుని టీడీపీ నాయకత్వం షాక్ గురయినట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: