ప్రజావేదిక ను కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.  రెండు రోజుల కలెక్ట్లర్ల సదస్సు పూర్తికాగానే ప్రజావేదిక కూల్చివేతలను చేపట్టనున్నట్లు  విస్పష్టం చేశారు. నిబంధలను తుంగ లో తొక్కి ప్రజావేదికను నిర్మించార న్న  ఆయన ,  గరిష్ట వరద వస్తే , ప్రజావేదిక భవనం మునిగిపోతుంది తెలిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుమతి ఇవ్వలేదని చెప్పారు . అయినా, టీడీపీ ప్రభుత్వం అంచనాలను పెంచి మరి ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు . అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రజావేదిక తోనే ప్రారంభిస్తామని చెప్పారు . 


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో, టీడీపీ నేతలు, ఆ పార్టీ అధినేత  చంద్రబాబు నివాసం లో అత్యవసరంగా సమావేశమయ్యారు . చంద్రబాబు వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .  చంద్రబాబు నివాసంలో సమావేశమైన టీడీపీ నేతలు,  అక్కడి నుంచి నేరుగా ప్రజావేదిక వద్దకు వచ్చి ఆందోళన చేసే అవకాశముందని భావించిన  పోలీసులు, స్థానికంగా  భారీ ఎత్తున  మోహరించారు . ఒకవేళ టీడీపీ నేతలు ఆందోళనకు దిగితే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు .  ఇక  చంద్రబాబు ఇంటికి వెళ్తోన్న  టీడీపీ నేతలను, ప్రజావేదిక వెనుక గేట్ నుంచి  వెళ్లాలని పోలీసులు సూచించడం పట్ల పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

 

 ప్రజావేదిక కూల్చివేతపై అధికార వైకాపా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ప్రజాధనం తో నిర్మించిన ప్రజావేదిక కూల్చడం సరికాదని టీడీపీ నేతలు అంటున్నారు . ప్రతిపక్ష నేతగా  చంద్రబాబు కు కేటాయించడం ఇష్టం లేకనే కూల్చివేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు . కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇలాగే కూల్చివేస్తారా ? అంటూ మాజీమంత్రి , ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: