పార్టీలో ముఖ్య కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీలను సోమవారం మధ్యాహ్నం జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించనున్నారు.

 

కొత్తతరం రాజకీయ వ్యవస్థ రూపకల్పన, పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందించటం, సమసమాజ నిర్మాణం, యువతరానికి పాతికేళ్ల భవిష్యత్తును అందించటానికి ఆవిర్భవించిన జనసేన పార్టీ ఆ దిశగా బలంగా రాజకీయాలు నెరపడానికి ప్రస్తుతం ముఖ్యమెనౖ కమిటీలకు పవన్‌ కళ్యాణ్‌ రూపకల్పన చేశారని పేర్కొంది.

 

ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారని, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు రూపమిచ్చారని పేర్కొంది. జరిగిన పొరపాట్లను మరల పునరావృతం కాకుండా ఉండటానికి ఇవి తగిన కృషి చేస్తాయన్నారు.

 

సోమవారం ప్రకటించబోయే కమిటీల్లో పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, లోకల్‌బాడీ ఎలక్షన్స్‌ కమిటీ, కాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మోనటరింగ్‌ కమిటీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనటరింగ్‌ కమిటీ వంటి ముఖ్యమైన కమిటీలు ఉన్నాయని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: