మొన్నటి ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీ మాడు పగులగొట్టినా ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. ప్రజావేదిక కూల్చివేత ఆదేశాలపై అడ్డుగోలుగా వాదనలు పెట్టుకుంటోంది.  రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ కట్టడమైన ప్రజావేదికను బుధవారం నాడు కూల్చేయమని ఆదేశించారు.

 

అప్పటి నుండి టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. అర్ధంపర్ధం లేని వ్యాఖ్యలు, ఆరోపణలతో జగన్ పై మండిపోతున్నారు. ప్రజావేదిక అన్నది ప్రభుత్వ, ప్రజల ఆస్తట. ప్రజావసరాల కోసం, ప్రభుత్వ డబ్బుతో నిర్మించిన భవనం కాబట్టి కూలగొట్టకూడదన్నది వాళ్ళ అభ్యంతరం. వాళ్ళ ప్రకారమే చూసినా ప్రజావేదికైతే టిడిపిదో లేకపోతే చంద్రబాబునాయుడు సొంత ఆస్తో కాదుకద ?

 

ప్రభుత్వంలో ఉన్నపుడు ఆ అక్రమ నిర్మాణాన్ని ఏమి చేయాలన్నది జగన్ ఇష్టం. కూల్చేయాలని నిర్ణయించినపుడు టిడిపి నేతలకు ఎందుకంత బాధ ? జగన్ ను కలవదలచుకున్న జనాలు సచివాలయంలోనే కలుస్తారు. ప్రజల డబ్బుతో కట్టిన భవనాన్ని ఎలా కూలుస్తారని అడగటంలో ఇక అర్ధమేలేదు. ఎందుకంటే ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ప్రజావేదిక అక్రమనిర్మాణం.

 

చంద్రబాబు హయాంలో అక్రమ నిర్మాణాలు ఎలా నిర్మించారో చెప్పటానికే ఈ భవనంలో కలెక్టర్ల సమావేశం పెట్టామని జగన్ చెప్పటాన్ని టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఐఏఎస్ అధికారులు అందరిముందు చంద్రబాబు పలుచనైపోయారన్నదే టిడిపి నేతల బాధగా కనిపిస్తోంది. లేకపోతే ప్రజావేదికను కూల్చేసిన తర్వాత కరకట్ట మీదే చంద్రబాబు ఉంటున్న మరో అక్రమ కట్టడాన్ని కూడా జగన్ కూల్చేస్తాడని ముందుగానే బంధాలేసేందుకు ప్రయత్నిస్తున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: