ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంతో వైరం మాని స్నేహభావంతో మెలగడం ఆంధ్రప్రదేశ్ కు కలిసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.55,548.87 కోట్లు సవరించిన ఒప్పందాలకు కేంద్ర జలశక్తి శాఖ సలహాసంఘం ఆమోదం తెలిపింది. దీనితో ప్రాజెక్టును పరుగులు పెట్టించే అవకాశం దక్కుతుంది. 


పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ. 4,318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ. 4,202.69 కోట్లు, హెడ్‌ వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు, పవర్‌ హౌస్‌ పనులకు రూ. 4,124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్ల రూపాయలు అంచనా ఖర్చులకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2014 మార్చి 31 నాటికి ఖర్చు చేసిన రూ.5,175.25 కోట్లలో రూ.3,777.44 కోట్లకు ఆడిట్‌ జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి నిధుల విడుదల ఉంటుందని కేంద్రం తెలిపింది.


ఇటీవలే పోలవరం వెళ్లిన జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, పనుల పురోగతిపై ఆడిట్‌ చేపడతామని   స్పష్టం చేశారు. ఇంజనీరింగ్‌ నిపుణుల కమిటీ సాంకేతిక అంశాలతోపాటు ఇప్పటిదాకా అయిన వ్యయం, బిల్లుల చెల్లింపు, ప్రాజెక్టు పురోగతి, ఇతర అనేక అంశాలపై ఈ తనిఖీ చేపడుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలవరం ప్రాజెక్టును 2021 ఫిబ్రవరి నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని జగన్‌ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: