నేను చనిపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి.. ఇదే నా ఆశయమం..  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చెప్పిన మాటలివి..  ఇప్పుడే కాదు.. ఆయన గతంలోనూ ఈ మాటలు ఒకటి రెండు సార్లు అన్నారు.. కానీ జగన్ దయచేసి అలా మాట్లాడవద్దని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అంటున్నారు. 


ప్రజల కోసం మంచి చేయాలని.. మంచి పాలకుడిగా ప్రజల మనసుల్లో చోటు నిలిచిపోవాలని కోరుకోవడం మంచిదే.. ఆ తపన ఏపీకి కూడా మేలు  చేస్తుంది.. కానీ భావం మంచిదే అయినా మరణాన్ని గురించిన మాటలు జగన్ నుంచి రాకూడదని ఆయన శ్రేయోభిలాషులు కోరుతున్నారు. 

ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి మంచి ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరోసారి అలాంటి నష్టం ఏపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ జరగకూడదని వారు కోరుకుంటున్నారు. జగన్ మంచి స్ఫూర్తితో ఆ మాటలు చెప్పినా.. ఆకాశంలో తథాస్తు దేవతలు ఉంటారని వారు గుర్తు చేస్తున్నారు. 

అందుకే మాట వరుసకు కూడా జగన్ మరణం గురించి మాట్లాడవద్దని అభిమానులు సూచిస్తున్నారు.  జగన్ మరో పాతికేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. జగన్ సుదీర్ఘకాలం సుపరిపాలన అందించాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: