చంద్రబాబు నివసిస్తున్న నివాసం అక్రమ కట్టడమని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ప్రతిపక్షంలో వున్నప్పుడే లింగమనేని గెస్ట్‌ హౌస్‌ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ వైసీపీ అధికారంలోకి రాగానే, చంద్రబాబు తన ఇంటిని ఖాళీ చేసేయడానికి సిద్ధమవ్వాలి. కానీ, ఆ పని చేయలేదు సరికదా, ప్రజా వేదికను తమకు ఇచ్చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు.. అతి తెలివితో. కానీ, ఏం లాభం.? ప్రజా వేదికను చంద్రబాబుకి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు సరికదా, దాన్ని స్వాధీనం చేసుకుని.. కలెక్టర్ల సదస్సు పెట్టి, ఆ తర్వాత కూల్చేయడానికి సిద్ధమయ్యింది ప్రభుత్వం. 


'ప్రభుత్వం నిర్మించిన కట్టడాన్ని ప్రభుత్వమే కూల్చేయడమా.? ఎంత ధనం వృధా అవుతుందో తెలుసా.?' అంటూ కొందరు టీడీపీ నేతలు అమాయకంగా ప్రశ్నించేస్తున్నారు. వాస్తు పేరుతో సచివాలయంలో చంద్రబాబు చేయించిన మార్పులు.. అందు కోసం అయిన ఖర్చు లెక్కలు తీస్తే, టీడీపీ నేతలు ఏమైపోతారో.!  ప్రజా వేదికను తనకు ఇచ్చేయాలని కోరడానికంటే ముందు చంద్రబాబు, తాను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి కొంత సమయం ప్రభుత్వాన్ని అడిగి వుంటే హుందాగా వుండేదేమో.


ఇంకా నయ్యం.. అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు చంద్రబాబుకి ఎందుకొస్తాయ్‌.? చేసేదే చెత్తపని, పైగా బుకాయింపులు. ఇంతకీ, అక్రమ కట్టడం అయిన లింగమనేని గెస్ట్‌ హౌస్‌ అంటే చంద్రబాబుకి ఎందుకంత మమకారం.? చంద్రబాబు తలచుకుంటే అలాంటివి ఒకటి కాదు.. వంద కట్టుకునే స్థోమత వుందాయనకి. కానీ, ఎందుకో.. చంద్రబాబు ఆ లింగమనేని గెస్ట్‌ హౌస్‌ని వదులుకునేందుకు సిద్ధపడ్డంలేదు. ఇదే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: